కేంద్ర వైద్య ఆరోగ్య శాఖాధికారి మాట్లాడుతూ.. దేశవ్యాప్తంగా నేడు కోవిడ్ రెండో వ్యాక్సినేషన్ కొనసాగుతుందని తెలిపారు. హెల్త్ కేర్ వర్కర్లు, ఐసిడిఎస్ సిబ్బంది మొదటి డోస్ ఎక్కడ వేసుకున్నారో రెండో డోస్ కూడా అక్కడే వేసుకోవాలని సూచించారు.
మొదటి డోస్ ఏ కంపెనీది వేసుకున్నారో రెండో డోస్ కూడా అదే కంపెనీది వేసుకోవాలని తెలిపారు. 28 రోజుల తర్వాత రెండో డోస్ వేసుకోవాలని, ఈ నెల 25 లోగా హెల్త్ కేర్ వర్కర్లు, ఐసిడిఎస్ సిబ్బంది మొదటి డోస్ వేసుకోవాలని చెప్పారు.
ఈ నెల 25 తర్వాత వీరికి మొదటి డోస్ వేయబోరని, ఇదే చివరి అవకాశమని చెప్పారు. రాష్ట్రంలో ఎక్కడైనా వీరు ఈనెల 25 లోగా వ్యాక్సిన్ వేసుకోవచ్చని తెలిపారు. ఇతర శాఖల సిబ్బంది మార్చ్ 5 లోగా మొదటి డోస్ వ్యాక్సిన్ వేసుకోవాలని అన్నారు.