ఇదే అంశంపై ఆ రాష్ట్ర సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ మాట్లాడుతూ, పట్టణాలు, నగరాల్లో పెరుగుతున్న కేసుల నేపథ్యంలో ఒక సమావేశాన్ని నిర్వహించి సరైన నిర్ణయం తీసుకుంటామన్నారు. క్రైసిస్ మేనేజ్‌మెంట్ గ్రూప్‌తో సమావేశాన్ని నిర్ణయిస్తామని... ఆ సమావేశంలో తుది నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. పెద్ద నగరాల్లో కంటైన్మెంట్ ప్రాంతాలను గుర్తిస్తున్నామన్నారు.
మరోవైపు మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి కార్యాలయం ఈ ఉదయం హిందీలో ట్వీట్ చేస్తూ... ప్రజలకు హెచ్చరికలను జారీ చేసింది. మహమ్మారి విస్తరిస్తున్న తరుణంలో ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించాలని, సామాజిక దూరాన్ని పాటించాలని, చేతులను తరచుగా శానిటైజ్ చేసుకోవాలని సూచించింది.