ముఖ్యంగా, అమ్మాయిలను అపహరించాల్సిందే అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారం రేపుతున్నాయి. అయితే.. ఈ వ్యాఖ్యలపై మహారాష్ట్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ లీడర్ సుబోధ్ సావ్జీ తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్యే రామ్ కదమ్ నాలుకను కోసి తీసుకొచ్చే వాళ్లకు రూ.5 లక్షల రివార్డు ప్రకటించాడు.