వివాహేతర సంబంధం వద్దని వారించడంతో ఫైర్ అయిన ఓ మహిళ ప్రియుడితో చేతులు కలిసి భర్తను హత్య చేసిన ఘటన కలకలం రేపింది. పోలీసుల వివరాల్లోకి వెళితే.. చెన్నై వడపళని భక్తవత్సలం కాలనీకి చెందిన గోపాలకృష్ణన్ (35) ఓ ప్రైవేటు కంపెనీలో విధులు నిర్వహిస్తున్నాడు. ఇతడికి భార్య భారతి. ఈ దంపతులకు ఏడాది వయస్సున్న కుమారుడు ఉన్నాడు.
భర్త కేకలు విన్న భార్య అక్కడికి రావడం గుర్తించిన ఆ వ్యక్తి ఆమెపై మత్తుమందు స్ప్రే చల్లి నగలు, నగదు దోచుకుని పరారయ్యాడు. ఇదిలా ఉండగా, అదే సమయంలో గస్తీ పనులు చేపడుతున్న పోలీసులు వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారణ జరిపారు. ఈ విచారణలో హత్య చేసిన వ్యక్తితో భారతికి వివాహేతర సంబంధం ఉందని, ఆ విషయం తెలుసుకున్న గోపాలకృష్ణన్‌ను హత్య చేసేందుకు ప్లాన్ చేసినట్లు తేలింది.
పక్కా ప్లాన్ ప్రకారమే హత్యచేసి నగదు, నగలు దోచుకుని విదేశాలకు పరారయ్యేందుకు యత్నించి పట్టుబడ్డారని పోలీసులు నిర్ధారించారు. ఆమెను అరెస్టుచేసి కోర్టులో హాజరు పరిచి జైలుకు తరలించారు. వివాహేతర సంబంధం కారణంగా తండ్రి హత్యకు గురవగా, తల్లి జైలు పాలవడంతో ఏడాది కుమారుడు రోడ్డున పడ్డాడు.