నిందితుడు బాధితురాలి ఫోన్‌లో సెల్ఫీ కూడా తీసుకుని, ఆమె ఫోటోలను తీశానని, వాటిని సోషల్ మీడియాలో షేర్ చేస్తానని హెచ్చరిస్తూ ఒక మెసేజ్ కూడా ఉంచాడని డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (జోన్ 5) రాజ్‌కుమార్ షిండే తెలిపారు. మహారాష్ట్రలోని పూణే నగరంలోని కోంధ్వా ప్రాంతంలోని ఒక హౌసింగ్ సొసైటీలో బుధవారం రాత్రి 7.30 గంటల ప్రాంతంలో ఈ సంఘటన జరిగిందని, నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.
బాధితురాలు ఒక ప్రైవేట్ సంస్థలో పనిచేస్తున్నారు. తన సోదరుడు బయటకు వెళ్లడంతో బాధితురాలు అపార్ట్‌మెంట్‌లో ఒంటరిగా ఉందని అధికారి తెలిపారు. ఆ వ్యక్తి కొరియర్ డెలివరీ ఏజెంట్‌గా నటిస్తూ ఆమె ఇంటికి వచ్చి లోపలికి ప్రవేశించాడు. సంతకం చేయడానికి పెన్ను అడిగాడు. తిరిగి పెన్ను తెచ్చే లోపు డోర్ లాక్ చేశాడని.. ఆపై అత్యాచారానికి పాల్పడ్డాడని పోలీసులు తెలిపారు.
రాత్రి 8.30 గంటల ప్రాంతంలో స్పృహలోకి రావడంతో ఆమెకు ఏమీ గుర్తులేదు. ఆ మహిళ తన బంధువులకు సమాచారం అందించగా, పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరిపారు. ఈ సంఘటన గురించి ఆమె ఎవరికైనా చెబితే, ఆ ఫోటోలను వైరల్ చేస్తానని బెదిరించినట్లు పోలీసులు తెలిపారు.