స్మార్ట్ ఫోన్ ఓకే.. ఇప్పుడేమో స్మార్ట్ రింగ్ వచ్చేస్తోంది.. నగదు రహిత చెల్లింపులు చేసుకోవచ్చట..!

సోమవారం, 9 జనవరి 2017 (14:30 IST)
పెద్ద నోట్ల రద్దుతో ప్రస్తుతం దేశంలో లావాదేవీలన్నీ కార్డులపై అవుతున్న నేపథ్యంలో.. లావాదేవీలన్నీ స్మార్ట్ ఫోన్లలో, బ్యాంకింగ్ విధానాల్లో ముగిసిపోతున్నాయి. అయితే ఉంగరం కూడా స్మార్ట్‌గా తయారైతే. ఎలాగంటే.. ఈ ఉంగరంతో సులువుగా నగదు రహిత చెల్లింపులు చేసుకోవచ్చట. ఆశ్చర్యంగా ఉంది కదూ.. అయితే ఈ స్టోరీ చదవండి. సాధారణంగా ఉంగరాలను ధరించడం ఓ ఫ్యాషన్. ప్రేమానుబంధాలకు రింగులు ధరించుకోవడం చూస్తుంటాం. 
 
అలాంటి అందరూ ఇష్టపడే రింగులతోనే చెల్లింపులు చేయగలిగితే ఎంత బాగుటుందో కదా.. అలాంటి దాన్నే హాంగ్‌కాంగ్‌కు చెందిన ఓ సంస్థ అలాంటి స్మార్ట్‌ రింగునే అభివృద్ధి చేసింది. ఆ రింగు చేతి వేలికి ఉంటే చాలు.. డెబిట్‌.. క్రెడిట్‌ కార్డులతో పనుండదట. దానితోనే సులువుగా నగదురహిత చెల్లింపులు చేసుకోవచ్చట. ఈ స్మార్ట్‌ ఉంగరం పేరు 'టాప్పీ'. అమెరికాలోని లాస్‌వెగాస్‌లో జరుగుతున్న వినియోగదారుల ఎలక్ట్రానిక్‌ షోలో ఈ రింగును ఆవిష్కరించారు.
 
వైర్‌సెల్ పేమెంట్ చిప్‌లతో కలిగివుండే ఈ రింగు స్మార్ట్ ఫోన్ యాప్ ద్వారా అనుసంధానం కావడంతో... ఆ యాప్ ద్వారా బ్యాంకు ఖాతాలకు సైతం లింకు ఏర్పరుచుకుంటుంది. దాంతో ఏ స్టోర్‌లోనైనా పేమెంట్‌ మెషీన్‌ దగ్గర రింగును చూపించి సులువుగా చెల్లింపులు చేయొచ్చట. రింగుకు ఛార్జింగ్‌ పెట్టాల్సిన అవసరం కూడా ఉండదు.
 
ఈ రింగుకు సంబంధించిన సాంకేతికతను జువెలరీ కంపెనీలకు అందించనున్నట్లు టాప్పీ సంస్థ తెలిపింది. వెండి.. బంగారం రెండింటితోనూ ఈ స్మార్ట్‌ రింగులను తయారు చేయొచ్చనని సంస్థ వెల్లడించింది. ఏప్రిల్‌లో అమెరికా మార్కెట్లోకి వచ్చే ఈ రింగు ధర సుమారు 7వేల వరకు ఉంటుందని తెలుస్తోంది.

వెబ్దునియా పై చదవండి