7 నుంచి మెట్రో రైల్ సేవలు.. తెలుసుకోవాల్సిన అంశాలివే....
బుధవారం, 2 సెప్టెంబరు 2020 (22:09 IST)
కరోనా లాక్డౌన్ తర్వాత అంటే సుమారు ఐదు నెలల తర్వాత మెట్రో రైల్ సేవలు ప్రారంభంకానున్నాయి. దేశంలోని ప్రధాన నగరాలైన ఢిల్లీ, హైదరాబాద్, చెన్నై, బెంగుళూరు వంటి ప్రధాన నగరాల్లో ఈ సేవలు అందుబాటులోకిరానున్నాయి.
ఇందులోభాగంగా, ఈ నెల 7వ తేదీ నుంచి దేశ వ్యాప్తంగా పునఃప్రారంభంకానున్నాయి. ఈ నెల 12 నుంచి అన్ని కారిడార్లు ప్రయాణికులకు అందుబాటులోకి రానున్నాయి. ఈ నేపథ్యంలో, మెట్రో రైలు సేవలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం కొన్ని మార్గదర్శకాలను విడుదల చేసింది. అవేంటో తెలుసుకుందాం.
* కంటైన్మెంట్ జోన్లలో ఉండే స్టేషన్లలో ఎంట్రీ, ఎగ్జిట్ గేట్లను మూసే ఉంచుతారు.
* థర్మల్ స్క్రీనింగ్ తర్వాత కరోనా లక్షణాలు లేని ప్రయాణికులను మాత్రమే మెట్రో రైల్వే స్టేషన్‌లోకే అనుమతిస్తారు.