దుర్మార్గపు తండ్రి : అన్నం పెట్టలేదని కత్తితో పొడిచాడు..!

బుధవారం, 6 సెప్టెంబరు 2017 (05:56 IST)
నేరాలు, ఘోరాలకు నిలయంగా మారుతున్న ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో మరో దారుణం జరిగింది. ఓ దుర్మార్గపు తండ్రి దారుణానికి పాల్పడ్డాడు. సమయానికి అన్నం పెట్టలేదనే ఆగ్రహంతో కన్నకూతురిని కత్తితో పొడిచాడో కసాయి తండ్రి. ఉత్తర్‌ప్రదేశ్‌లోని మొరాదాబాద్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది.
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే... మొరాదాబాద్, బంగ్లా గ్రామంలో నివసిస్తున్న నన్హే అనే వ్యక్తికి భార్య, నలుగురు పిల్లలు ఉన్నారు. మద్యానికి బానిస అయిన నన్హే ఇంటికి మందుతాగి వచ్చాడు. అన్నం పెట్టమని 15ఏళ్ల కుమార్తెను అడిగాడు. ఆమె ఇంటి పనులు చేస్తుండటంతో అన్నం వడ్డించడం కొద్దిగా ఆలస్యమైంది. దీంతో ఆగ్రహావేశానికి గురైన నన్హే కుమార్తెను కత్తితో పొడిచాడు. 
 
ఆ తర్వాత అక్కడ నుంచి పారిపోయాడు. కసాయి తండ్రి కత్తితో పొడవడంతో తీవ్రంగా గాయడిన బాధితురాలిని చికిత్స నిమిత్తం ఆసుపత్రిలో చేర్పించారు. దీనిపై ఫిర్యాదు తీసుకునేందుకు పోలీసులు నిరాకరించినట్లు బాధితురాలి కుటుంబసభ్యులు ఆందోళన చేశారు. ప్రస్తుతం బాధితురాలి పరిస్థితి విషమంగా ఉంది. మెరుగైన చికిత్స కోసం వేరే ఆసుపత్రికి తరలించాలని వైద్యులు సూచించారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు