నాలుగో బాయ్‌ఫ్రెండ్‌తో జల్సాల కోసం కన్నబిడ్డనే హతమార్చింది. వివరాల్లోకి వెళితే.. ఊటీలోని వాషర్‌మెన్ పేట్‌కు చెందిన కార్తీక్ (40), గీత (38)ను కొన్నేళ్ల క్రితం వివాహం చేసుకున్నాడు. పెద్దలు కుదిర్చిన వివాహం కావడంతో కొంత కాలం సంతోషంగా కాపురం చేశారు.
ఇద్దరు పిల్లలు పుట్టిన తరువాత దంపతుల మధ్య గొడవలు మొదలయ్యాయి. పెద్దల సమక్షంలో పంచాయితీలు చేసినా కాపురం నిలబడకపోవడంతో విడాకులు తీసుకున్నారు. ఈ క్రమంలో కొడుకులు నితీశ్, నితిన్‌లను పంచుకున్నారు. ఒక కొడుకు తల్లి దగ్గర, ఇంకో కొడుకు తండ్రి దగ్గర ఉంటున్నారు.
తమ జల్సాల అడ్డుగా ఉన్నాడనే గీత తన బిడ్డకు.. మద్యం తాగించి, ఎక్కువ భోజనం పెట్టి, పదే పదే పాలు తాగించి హత్య చేసిందని పోలీసులు వెల్లడించారు. దీంతో ఆమెను అరెస్ట్ చేసినట్టు పేర్కొన్నారు.