ఆ గ్రామంలో అమ్మాయి ఫోన్ మాట్లాడితే రూ.25వేల అపరాధం విధించాలని ముస్లిం మతపెద్దల పంచాయితీ తీర్మానించింది. అలాగే, గోవధకు పాల్పడితే రూ.2.50 లక్షల అపరాధం విధించేలా నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ఈ ముస్లిం మతపెద్దల పంచాయతీ తీసుకున్న నిర్ణయం సంచలనంగా మారింది.
గోవధకు పాల్పడిన వారికి రూ.2.5లక్షల జరిమానా విధించాలని... అందులో రూ.51 వేలను సమాచారం అందించిన వారికి ఇవ్వాలని నిర్ణయించారు. అలాగే, రోడ్లపై ఆడపిల్లలు సెల్ఫోన్లో మాట్లాడుతూ వెళితే రూ.21 వేలు జరిమానా విధించాలని పంచాయతీ సభ్యులు నిర్ణయించారు. బాలికలపై జరుతున్న నేరాలను అరికట్టేందుకు, పారిపోతున్న ప్రేమ జంటలకు చెక్ పెట్టేందుకు ఈ తీర్మానం తీసుకున్నట్టు గ్రామస్తులు చెప్పారు.