ఫిలడెల్ఫియా: సాటి వారికి సాయం చేయడంలో ఎప్పుడూ ఉత్తర అమెరికా తెలుగు సంఘం ముందుంటుందనేది నాట్స్ మరోసారి నిరూపించింది. నాట్స్ ఫిలడెల్ఫియా విభాగం ఆధ్వర్యంలో తెలుగు వారు తమకు వీలైనంత విరాళాన్ని ఇచ్చి అలా వచ్చిన మొత్తాన్ని స్థానికంగా పేదల ఆకలి తీర్చే మన్న ఆన్ మెయిన్ స్ట్రీట్ ఫుడ్ ప్యాంట్రీకి విరాళంగా అందించారు. మొత్తం 8 వేల డాలర్లను ఈ ఫ్యాంట్రీకి నాట్స్ విరాళంగా అందించింది.
నాట్స్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ హరినాథ్ బుంగటావుల నేతృత్వంలో ఈ వితరణ కార్యక్రమం జరిగింది. నిరుపేదలకు ఆకలి బాధలు లేకుండా చేయడంలో తమ వంతు సాయం చేయాలనే సంకల్పంతో తెలుగు వారు నాట్స్ ద్వారా ఈ విరాళాన్ని అందించారు. పేదల ఆకలి తీర్చే ప్రయత్నం చేసిన నాట్స్ ఫిలడెల్ఫియా విభాగాన్ని నాట్స్ చైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని, నాట్స్ అధ్యక్షుడు మదన్ పాములపాటి, నాట్స్ బోర్డ్ డైరెక్టర్ శ్రీధర్ అప్పసాని ప్రత్యేకంగా అభినందించారు.
ఫుడ్ ఫ్యాంట్రీ కోసం నాట్స్‌కు విరాళాలు ఇచ్చిన వారి వివరాలు ఇలా ఉన్నాయి.