ది మోర్నింగ్ కన్సల్ట్ నిర్వహించిన గ్లోబల్ లీడర్ అప్రూవల్ రేటింగ్ ట్రాకర్ సర్వేలో అమెరికా, బ్రిటన్, రష్యా, ఆస్ట్రేలియా, కెనడా, బ్రెజిల్, ఫ్రాన్స్, జర్మనీ, భారత దేశం సహా 13 దేశాల నేతలపై అభిప్రాయాలను సేకరించారు. ఈ సర్వేలో భాగంగా, ఎన్నికైన ప్రజా ప్రతినిధుల నేషనల్ రేటింగ్స్‌ను ట్రాక్ చేశారు.
గ్లోబల్ లీడర్ అప్రూవల్ రేటింగ్ ట్రాకర్‌ను గురువారం అప్‌డేట్ చేశారు. భారతదేశంలో 2,126 మంది వయోజనులు ఈ సర్వేలో పాల్గొన్నట్లు ఈ సంస్థ తెలిపింది. మోడీకి 66 శాతం అప్రూవల్ రేటింగ్ వచ్చిందని, 28 శాతం మంది ఆయనను ఆమోదించలేదని తెలిపింది.
తాజా సర్వేలో మోడీకి ప్రథమ స్థానం రాగా, రెండో స్థానంలో ఇటలీ ప్రధాన మంత్రి మరియో డ్రఘి (65 శాతం) నిలిచారు. మెక్సికో ప్రెసిడెంట్ ఆండ్రెస్ మాన్యుయెల్ లోపెజ్ ఒబ్రడోర్ 63 శాతం అప్రూవల్ రేటింగ్‌తో మూడో స్థానంలో నిలిచారు.
ఆ తర్వాతి స్థానాల్లో వరుసగా ఆస్ట్రేలియా పీఎం స్కాట్ మారిసన్ (54 శాతం), జర్మన్ ఛాన్సలర్ ఏంజెలా మెర్కెల్ (53 శాతం), అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ (53 శాతం), కెనడా పీఎం జస్టిన్ ట్రుడూ (48 శాతం), బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ (44 శాతం) ఉన్నారు.
దక్షిణ కొరియా ప్రెసిడెంట్ మూన్ జే ఇన్ (37 శాతం), స్పానిష్ స్పెయిన్ పెడ్రో శాంచెజ్ (36 శాతం), బ్రెజిల్ ప్రెసిడెంట్ జైరే బోల్సోనారో (35 శాతం), ఫ్రెంచ్ ప్రెసిడెంట్ ఎమ్మాన్యుయేల్ మాక్రన్ (35 శాతం), జపనీస్ పీఎం యొషిహిడే సుగ (29 శాతం) నిలిచారు.