కరోనా పేషెంట్లకు మెరుగైన వైద్య సదుపాయాలు కల్పించాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌ను విచారించిన ద్విసభ్య బెంచ్ ఈ వ్యాఖ్యలు చేసింది. ప్రస్తుత పరిస్థితులను చూస్తుంటే చిన్నచిన్న పట్టణాలు, గ్రామాలను కూడా రాముడే కాపాడాలని వ్యాఖ్యానించింది.
కరోనా సోకిన సంతోశ్ కుమార్ అనే వ్యక్తికి ఓ ఆసుపత్రిలో చికిత్స అందించారు. కానీ, ఆ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. అయితే అతని మరణం తర్వాత... అతని మృతదేహాన్ని గుర్తు తెలియని వ్యక్తిదిగా ఆసుపత్రి వైద్యులు, స్టాఫ్ పేర్కొన్నారు.
ప్రజలకు సరిపడా ఆసుపత్రులు కూడా లేవని మండిపడింది. ఒక హెల్త్ సెంటర్‌లో దాదాపు 3 లక్షల ప్రజల లోడ్ ఉంటే... అక్కడ కేవలం 30 బెడ్లు మాత్రమే ఉన్నాయని ఘాటుగా వ్యాఖ్యానించింది. అంటే ఆ హెల్త్ కేర్ సెంటర్ కేవలం 0.01 శాతం మంది ప్రజలకు మాత్రమే సేవలందించగలదని దుయ్యబట్టింది. ఇలాంటి పరిస్థితుల్లో కరోనా రోగులను ఆ రాముడే కాపాడాలన్నారు