యూపీలో ఒకే ఆస్పత్రిలో 81 మంది గర్భిణీలకు హెచ్ఐవీ సోకింది. మీరట్ జిల్లాలోని లాలా లజపతిరాయ్ మెడికల్ కాలేజీలో 16 నెలల్లో 81 మందికి పైగా మహిళలకు హెచ్ఐవీ సోకింది. , దీనిపై తాము విచారణకు ఆదేశించామని ఆరోగ్య శాఖ అధికారి తెలిపారు.
18 నెలలు నిండిన తర్వాత నవజాత శిశువులకు హెచ్‌ఐవి పరీక్షలు నిర్వహిస్తామని వైద్యులు తెలిపారు. హెచ్‌ఐవీ సోకిన మహిళలు, నవజాత శిశువులు ఆరోగ్యంగా ఉన్నారని మీరట్ చీఫ్ మెడికల్ ఆఫీసర్ (సీఎంఓ) డాక్టర్ అఖిలేష్ మోహన్ ప్రసాద్ చెప్పారు.