నన్నొదిలెయ్ అంటూ మహిళ దండం పెట్టినా రేప్ చేయబోయిన పంచాయతీ ప్రెసిడెంట్...

శుక్రవారం, 27 మే 2016 (22:34 IST)
కామ పిశాచాలు అవకాశం కోసం తిరుగుతూనే ఉంటాయి. తాజాగా కర్నాటకలోని మాండ్యా జిల్లా కెస్టూరు పంచాయతీ కార్యాలయంలో పంచాయతీ ప్రెసిడెంట్ ఓ మహిళపై అత్యాచార యత్నం చేసిన ఘటన వెలుగుచూసింది. ఆమెకు భర్త లేకపోవడంతో పంచాయతీ ప్రెసిడెంట్  దాన్ని అలుసుగా తీసుకుని ఆమెపై అత్యాచారం చేయబోయాడు. సదరు మహిళ అతడి ప్రయత్నాన్ని ఎంత అడ్డుకున్నా, చివరికి చేతులు జోడించి దండం పెట్టినా అతడు ఆమెను వదల్లేదు. 
 
ఆమెపై అత్యాచారం చేయబోయాడు. ఈ ఘటన అంతా కార్యాలయంలోని సీసీ కెమేరాల్లో రికార్డు కావడంతో అతడి బండారం బట్టబయలైంది. ఇతడు జేడీఎస్‌కు చెందిన చంద్రహాస్ అని తేలింది. అతడు పాల్పడిన దారుణమంతా మీడియాలో కూడా రావడంతో కర్నాటకలో అతడిపై ఆగ్రహం పెల్లుబుకుతోంది. ఇంతకుముందు కూడా ఇతడు ఇలాగే పలువురు మహిళలపై ఇలాంటి నీచానికి పాల్పడినట్లు కేసులున్నాయని అంటున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

వెబ్దునియా పై చదవండి