అయితే ఇది భారతదేశంలో కనిపించదని.. ఆఫ్రికా, ఆస్ట్రేలియా, అట్లాంటిక్ వంటి ప్రాంతాల్లోనే కనిపిస్తుందని పేర్కొన్నారు. దాని ప్రభావం భారత్‌లోనూ ఉంటుందంటూ వస్తున్నవన్నీ వదంతులేనని స్పష్టంచేశారు. ముఖ్యంగా పుట్టబోయే బిడ్డలపై గ్రహణానికి సంబంధించిన హానికారక ప్రభావాలు ఉంటాయని చేసే ప్రచారాలను నమ్మొద్దని శ్రీరఘునందన్‌కుమార్ తెలిపారు. పైగా, 2023 సంవత్సరంలో కనిపించే తొలి చంద్రగ్రహణం కావడం గమనార్హం.