జేడీయూ నుండి ప్రశాంత్ కిషోర్ తో పాటు పవన్ వర్మలను పార్టీ నుండి బహిష్కరిస్తున్నట్టుగా ఆ పార్టీ ప్రకటించింది. బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్‌కు అత్యంత సన్నిహితులుగా ఉన్న ప్రశాంత్ కుమార్, పవన్ వర్మలను పార్టీ నుండి బహిష్కరిస్తున్నట్టుగా ఆ పార్టీ ప్రకటించింది.
బీహార్ సీఎం నితీష్ కుమార్‌కు సీఏఏ విషయంలో రాసిన లేఖలో పనవ్ వర్మ తీవ్ర విమర్శలు గుప్పించారు. 2018 నుండి జేడీయూ ఉపాధ్యక్షుడిగా ప్రశాంత్ కిషోర్ కొనసాగుతున్నాడు. సీఏఏ, ఎన్‌ఆర్‌సీ విషయంలో వీరిద్దరి మధ్య అభిప్రాయబేధాలు నెలకొన్నాయి.