మహారాష్ట్రలోని పూణే నగరంలో యశ్వంతరావు మొహితే కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్ సైన్సు అండ్ కామర్స్ కళాశాల ఉంది. ఇందులో 53 యేళ్ళ శివాజీ బొర్హాడే అనే వ్యక్తి ప్రొఫెసర్‌గా పని చేస్తున్నాడు. ఈయనకు ఇద్దరు ఆడపిల్లలు కూడా ఉన్నారు. ఈయన వద్దకు పీహెచ్డీ చేసేందుకు ఇరాన్ దేశానికి చెందిన 31 ఏళ్ల మహిళ పీజీ పూర్తి చేసి, అకౌంట్స్‌లో పీహెచ్డీ చేయాలని నిర్ణయించింది.
ఈనెల 8వతేదీన ఇరాన్ మహిళ తనకు పీహెచ్డీ సీటు ఇవ్వాలని ప్రొఫెసర్ బొర్హాడేను కోరింది. తనతో లైంగిక సంబంధం పెట్టుకొని తన కోరిక తీరిస్తే పీహెచ్డీ సీటు ఇస్తానని ప్రొఫెసర్ సెలవియ్యడంతో ఆ ఇరాన్ మహిళ షాక్‌కు గురైంది. వెంటనే ప్రొఫెసర్ గదిలోనుంచి బయటకు వచ్చి తన గదిలోకి వెళ్లిన ఇరాన్ మహిళ స్వదేశంలో ఉన్న తల్లిదండ్రులతో మాట్లాడి తన కోరిక తీర్చమన్న ప్రొఫెసరుపై పూణే పోలీసులకు ఫిర్యాదు చేసింది.