ఆరెస్సెస్ కార్యకర్తలు నిక్కర్లు ధరిస్తారని, కానీ ఆ సంస్థలోని మహిళలకు మాత్రం అ అవకాశం లేదని వాపోయారు. విద్య, ఆరోగ్య రంగాలపై కూడా దృష్టిపెడుతుందన్నారు. మీకేం కావాలో తెలుసుకోవడానికి మీతో నరేంద్ర మోదీ ఎప్పుడైనా మాట్లాడారా? అని అడిగారు.
బీజేపీకి ఆరెస్సెస్ ప్రధాన సంస్థ.. అందులో ఎందరు మహిళలున్నారని రాహుల్ గాంధీ ప్రశ్నించారు. మహిళలు నోరు తెరవడాన్ని బీజేపీ, ఆరెస్సెస్ అంగీకరించవని, వారు మౌనంగా ఉండాలనే కోరుకుంటాయని ఆరోపించారు. వారి నోళ్లు మూయించేందుకు ఆ రెండూ పరుగులు తీస్తుంటాయన్నారు. గుజరాతలో కాంగ్రెస్ కనుక అధికారంలోకి వస్తే మహిళా సాధికారతపై దృష్టిసారిస్తామన్నారు.