రూ.20 ఇవ్వండి పడక సుఖం ఇస్తాం.. అమ్మాయిల ప్రాణాలు తీయొద్దు.. సొనాగచ్చి సెక్స్ వర్కర్

ఠాగూర్

శుక్రవారం, 23 ఆగస్టు 2024 (13:25 IST)
కోల్‌కతా మెడికో హత్యాచారం ఘటనపై సోనాగచ్చికి చెందిన ఓ సెక్స్ వర్కర్ స్పందించారు. కామంతో కళ్లుమూసుకునివుండే పురుషులకు ఆమె ఓ విన్నపం చేశారు. రూ.20 ఇచ్చి.. తమ వద్ద పడక సుఖం పొందవచ్చని, అంతేకానీ అమ్మాయిల మాన ప్రాణాలు తీయకండి అంటూ వేడుకున్నారు. ఆమె తాజాగా చేసిన ఈ వాఖ్యలు సమాజంలోని పోకడలకు అద్దం పడుతున్నాయి. సోనాగచ్చి వంటి ప్రాంతాలు ఎందుకు ఉండాలో చెప్పిన ఆమె వ్యాఖ్యల వీడియో ఇప్పుడు విపరీతంగా వైరల్ అవుతోంది.
 
ఓ మీడియా ప్రతినిధితో ఆమె మాట్లాడుతూ 'మీ కోరికను తృప్తిపరుచుకోవాలంటే సోనాగచ్చికి రండి. ఇలా చదువుకున్న అమ్మాయిలు, పనిచేసుకుంటున్న మహిళలపై దారుణాలకు పాల్పడాల్సిన అవసరం ఏముంది? 20, 30 రూపాయలు ఇచ్చినా పనిచేసేందుకు మేం సిద్ధంగా ఉన్నప్పుడు వాళ్ల వెంటపడి ఉసురు తీస్తారు ఎందుకు?' అని ప్రశ్నించింది. సోనాగచ్చి లాంటి ప్రాంతాలు ఉండగా ఇలాంటి అఘాయిత్యాలు జరుగుతుండడాన్ని ఆమె వ్యాఖ్యలు ఎత్తిచూపాయి.
 
నిజానికి సోనాగచ్చి లాంటి ప్రాంతాలు ఎప్పటికీ వివాదాస్పదమే. ఇవి సమాజాన్ని నాశనం చేస్తున్నాయన్న అభిప్రాయం చాలామందిలో నెలకొంది. ప్రభుత్వాలు కూడా ఇదే అభిప్రాయంతో ఉంటాయి. ఇలాంటివి లేకపోతే సమాజంలో జరిగే అరాచకాలను ఊహించుకోలేరని ఆమె వ్యాఖ్యలు చెప్పకనే చెప్పాయి. రెడ్‌లైట్ ఏరియాలు అక్కడక్కడా ఉండడం వల్లే మహిళలకు కొంతైనా భద్రత లభిస్తోందన్న భావన ఆమె మాటల్లో వ్యక్తమైంది.
 
కామవాంఛ గల పురుషుల నుంచి ఇలాంటి ప్రాంతాలు మహిళలను రక్షిస్తూనే ఉన్నాయని చెప్పుకొచ్చింది. నిజానికి సోనాగచ్చి లాంటి వాటిని చెడుగా చూస్తారు. ఇలాంటి వాటిపై ఉక్కుపాదం మోపాలనుకుంటున్న ప్రభుత్వాలు ఆమె ప్రశ్నకు ఏమని సమాధానం చెబుతాయన్న ప్రశ్న అందరిలోనూ మొదలైంది. పురుషులకు రెడ్‌లైట్ ఏరియాలు ఎందుకు అవసరమన్న మరో ప్రశ్నకు ఆమె బదులిస్తూ.. రెడ్‌లైట్ ఏరియాలు లేకుండా మహిళలు బతకగలిగినప్పుడు.. పురుషులు ఎందుకు ఆ పనిచేయలేరు.. అని ప్రశ్నించి సామాజిక రుగ్మతలను సవాలు చేసింది. 


 

Asia का सबसे बड़ा रेड लाइट एरिया !! "कोलकाता का सोनागाछी है"

रेड लाइट एरिया में काम करने वाली ये महिला कह रही है हवस मिटानी है तो सोनागाछी आना था, पढ़ने लिखने और काम करने वाली महिलाओं को नोंचने की क्या जरूरत है ?

यह महान महिला ने समाज को आईना दिखा रही है अगर #Red_Light_Areapic.twitter.com/YtsrA9yaSA

— MANOJ SHARMA LUCKNOW UP???????????????????????? (@ManojSh28986262) August 21, 2024

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు