ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రావాల్సిన ప్రత్యేక హోదా, విశాఖ జోన్, కడప ఉక్కు కర్మాగారాలు సహా అన్ని హామీలపై చంద్రబాబు రోజుకో మాట మాట్లాడుతున్నారన్నారు. బీజేపీతో చంద్రబాబు లాలూచీ పడి, చంద్రబాబు ప్రజలను వంచిస్తున్నారని విమర్శించారు. ఏపీ ప్రజల భవిష్యత్తును కేంద్రానికి తాకట్టు పెట్టారని రోజా తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
సీఎం చంద్రబాబుకు చిన్న మెదడు చిట్లిపోయిందని, ప్రత్యేక హోదాపై యూ టర్న్ తీసుకోలేదని చంద్రబాబు వ్యాఖ్యనించటం హాస్యాస్పదంగా ఉందన్నారు. దేశంలోనే ఎవరికీ ఇవ్వని ప్యాకేజీ ఏపీకి ఇచ్చారని అసెంబ్లీలో తీర్మానం చేయడం నిజం కాదా అని రోజా ప్రశ్నించారు.