ఆయన అంత్యక్రియలు నిర్వహించేందుకు వాల్వేశ్వర్ ప్రాంతంలోని బాబు పన్నాలాల్ జైన దేవాలయంలో వేలంపాట నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న జైనమతానికి చెందిన ఓ వైద్యుడు, ఓ నిర్మాణ సంస్థ అధినేత, మరో ముగ్గురు ప్రముఖ వ్యాపారులు మొత్తం రూ.11,11,11,111కు సొంతం చేసుకున్నారు.
ఈ నగదులో కొంత మొత్తాన్ని ధార్మిక, సేవా కార్యక్రమాలకు వినియోగిస్తామన్నారు. అనంతరం నాలుగు వెండి కుండల్లో నీళ్లు నింపి ప్రేమ్‌సుర్జీస్వజీ పార్థివదేహాన్ని ఉంచి అంతిమయాత్ర నిర్వహించారు. ఆయన మృతదేహాన్ని 300 కిలోల గంధపు చెక్కలతో ఖననం చేశారు.