దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న షీనా బోరా హత్య కేసులో సరికొత్త ట్విస్ట్ ఆరంభమైంది. తన కుమార్తె ప్రాణాలతోనే ఉన్నట్టు ఈ కేసులో ప్రధాన నిందితురాలైన ఇంద్రాణి ముంబై పోలీసులకు చెపుతోంది. ఈ మాటలు విన్న ముంబై పోలీసులు ఖిన్నులయ్యారు. ప్రస్తుతం ముంబై పోలీసు కస్టడీలో ఉన్న ఇంద్రాణి వద్ద పోలీసుల ఈ కేసుకు సంబంధించిన విషయాలపై ఆరా తీస్తున్నారు.
ఈ విచారణలో భాగంగా ఆమె ఆసక్తికర విషయాలు వెల్లడించింది. తాను తన బిడ్డ షీనా బోరాను చంపలేదని, ఆమె అమెరికాలో బతికేవుందని, తనంటే ద్వేషంతోనే షీనా బయటకు రావడం లేదని ఇంద్రాణి వెల్లడించినట్టు తెలుస్తోంది. షీనా బోరా హత్యకు గురైన దాదాపు మూడేళ్లకు షీనాను, అమె రెండవ భర్త సంజీవ్ ఖన్నాను, కారు డ్రైవర్ తదితరులను పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు తాజాగా ఇంద్రాణి విచారణలో చెబుతున్న విషయాలతో, పోలీసులే తలపట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.
ఈ కేసులో ఎలా ముందుకు సాగాలా? అని ఆలోచిస్తున్నట్టు ముంబై పోలీసు వర్గాలు వెల్లడించాయి. షీనా బతికే ఉందని ఇంద్రాణి చేస్తున్న వాదనను నమ్మడం లేదని, ఆమె యూఎస్ ప్రయాణించిందని చెబుతున్న సమయంలో విమానాల్లో ప్రయాణించిన వారి వివరాలు సేకరిస్తున్నామని పోలీసులు తెలిపారు. షీనా సెల్ ఫోన్‌ను ఇంద్రాణి సంవత్సరం రోజుల పాటు వాడుకుందనటానికి, ఆ సెల్ నుంచి రాహుల్ ముఖర్జియాకు మెసేజ్‌లు వెళ్లాయని తమ వద్ద పక్కా ఆధారాలు ఉన్నట్టు పోలీసులు అంటున్నారు.