జయలలిత మృతిపై మెడికల్ రిపోర్టు ఇవ్వండి.. మద్రాసు హైకోర్టు ఆదేశం

సోమవారం, 9 జనవరి 2017 (14:32 IST)
తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత మృతిపై వైద్య నివేదికను సమర్పించాలని మద్రాసు హైకోర్టు కోరింది. ఈ రిపోర్టును ఓ షీల్డ్ కవర్‌లో ఉంచి కోర్టుకు అందజేయాలని సూచించింది. జయలలిత మృతిపై అనుమానాలున్నాయంటూ అన్నాడీఎంకే కార్యకర్త పీఏ జోసెఫ్ హైకోర్టులో ఓ పిల్‌ను దాఖలు చేశారు. ఈ పిటిషన్ సోమవారం విచారణకు వచ్చింది. దీనిపై వాదనలు విన్న హైకోర్టు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు... కేంద్ర హోంశాఖ, అపోల్ ఆస్పత్రి యాజమాన్యాలకు సర్కార్‌కి నోటీసులు జారీ చేసింది. 
 
ఇందులో జయలలిత మృతికి సంబంధించిన రిపోర్టును వచ్చే నెల 23ల తేదీన కోర్టుకు సమర్పించాలని ఆదేశించింది. ఈ హైకోర్టు ఆదేశాలపై ప్రభుత్వ తరపు లాయర్ స్పందిస్తూ.. జయలలితకు అందించిన చికిత్సపై నివేదికను కోర్టుకు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్టు వెల్లడించారు. అలాగే, జయకు నిర్వహించిన ట్రీట్‌మెంట్‌పై నివేదికను బహిర్గతం చేసేందుకు సిద్ధమని అపోలో ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. 

వెబ్దునియా పై చదవండి