తనను పట్టించిన జగదీశ్‌పై కోపం పెంచుకున్న ఆ వానరం వెంటనే అధికారుల నుంచి తప్పించుకొని జగదీశ్ వెంట పడింది. భయపడిపోయిన అతను తన ఆటోలో దాక్కున్నాడు. ఆటో టాప్, సీట్లను చించి జగదీశ్‌పై దాడి చేసింది. చెవులను కొరికి తన కోపాన్ని తీర్చుకుంది.
వెంటనే అధికారులు ఆ వానరాన్ని పట్టుకొని ఊరికి 22 కిలోమీటర్ల దూరంలోని ఓ అడవిలో విడిచిపెట్టారు. అయితే కోతి ఓ లారీ మీద ఎక్కి మళ్లీ గ్రామానికి చేరుకుంది. జగదీశ్ కోసం ఊరంతా తిరిగింది. కోతి చెవిమీద ఉన్న గుర్తును గమనించి గ్రామస్థులు ఆ వానరం ముందుదేనని గుర్తించారు. ఊళ్లోకి కోతి వచ్చిన విషయాన్ని జగదీశ్‌కు చెప్పడంతో అతడిలో మళ్లీ టెన్షన్ మొదలైంది.