స్వామి శరణమంటూ పరుగులు పెట్టిన తృప్తి దేశాయ్.. చుక్కలు చూపించారుగా..

బుధవారం, 27 నవంబరు 2019 (22:52 IST)
అయ్యప్పస్వామిని మహిళలు  ఎందుకు దర్సించుకోకూడదంటూ ముందు నుంచి పోరాటం చేస్తోంది భూమాతా బ్రిగేడ్ నాయకురాలు తృప్తి దేశాయ్. ఆమె గతంలో కోర్టులో ఈ వ్యవహారం నడుస్తుండగానే అయ్యప్పస్వామి ఆలయానికి వెళ్ళడానికి ప్రయత్నించింది. అయితే చివరకు ఉపయోగం లేకుండా పోయింది.
 
కానీ గత మూడురోజుల నుంచి శబరిమలైలోనే ఉన్న తృప్తి దేశాయ్ ఎలాగైనా స్వామివారిని దర్సించుకునే వెళతానని భీష్మించుకు కూర్చుంది. అయితే ఆమె ఎక్కడికి వెళ్ళినా సరే హిందూ సంఘాలు మాత్రం ఆమెను ఎక్కడికక్కడే అడ్డుకుంటున్నాయి. 
 
మొన్నటికి మొన్న కారంపొడి నీళ్ళతో ఆమెపై స్ప్రే చేసి భయాందోళకు గురిచేసిన హిందూ సంఘాలు ఆమె ఎక్కడ కనబడితే అక్కడ అడ్డుపడుతూనే ఉన్నాయి. దీంతో తృప్తి దేశాయ్ ఈరోజు మధ్యాహ్నం నేరుగా కమిషనర్ కార్యాలయం వద్దకు వెళ్ళారు. తనకు భద్రత కల్పించాలని పోలీసులను కోరారు. అయితే పోలీసులు అది సాధ్యం కాదని తేల్చేశారు. 
 
తృప్తి కమిషనర్ కార్యాలయం వద్ద ఉందని తెలుసుకున్న హిందూ ధార్మిక సంఘాలు అక్కడకు పెద్ద ఎత్తున చేరుకున్నాయి. ఆమెకు వ్యతిరేకంగా నినాదాలు చేశాయి. దీంతో తృప్తి దేశాయ్ వెనక్కి తగ్గింది. పుణేకు బయలుదేరి వెళ్ళిపోయింది. దీంతో హిందూ ధార్మిక సంఘాల నేతలు కూడా శాంతించారు. 
 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు