గోదారమ్మ ఉగ్రరూపం : ధవళేశ్వరం వద్ద ప్రమాద హెచ్చరిక

మంగళవారం, 6 ఆగస్టు 2019 (11:05 IST)
రాజమండ్రి ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద మొదటి ప్రమాద హెచ్చరికను కొనసాగిస్తున్నారు. భద్రాచలం వద్ద నీటి మట్టం పెరుగుతుండడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. క్రమేపీ తగ్గుదలతో  కొనసాగుతున్న ధవళేశ్వరం బ్యారేజ్ మొదటి ప్రమాద హెచ్చరిక కొనసాగుతూ ఉంది. 
 
ధవళేశ్వరం బ్యారేజీ వద్ద నీటి మట్టం 12.1 అడుగులు ఎత్తులో ధవళేశ్వరం బేరేజీ వద్ద వరద నీరు ప్రవహిస్తోంది. మొదటి ప్రమాద స్థాయిలో ఉంది. అలాగే, 10.54 లక్షల క్యూసెక్కుల వరద నీటిని సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. 
 
ప్రస్తుతం ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద క్రమ క్రమంగా నీటి మట్టం తగ్గుతున్నప్పటికీ.. అదే రీతిలో క్రమక్రమంగా భద్రాచలం వద్ద నీటి మట్టం 43.20 అడుగులకు పైగా పెరుగుతుండడంతో పాటు ఇతర జలాశయాల నుండి వరద ప్రవాహం పెరగుతోంది. బుధవారానికి ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద మరింతగా పెరిగే అవకాశం ఉన్నట్టు ఇంజనీర్లు వెల్లడించారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు