ఈ వివరాలను పరిశీలిస్తే, హర్యానాకు చెందిన ఓ జూనియర్ ఆర్టిస్ట్, ఓ టీవీ నటి కలిసి గతంలో పలు రియాల్టీ ప్రదర్శనలు చేసేది. ఈ క్రమంలో గత నెల 13వ తేదీన పార్టీ ఉందని చెబితే, నటి ఓ హోటల్2కు వెళ్లింది. ఆపై ఆమెకు డ్రగ్స్ ఇచ్చిన జూనియర్ ఆర్టిస్ట్, ఆమెపై అత్యాచారం చేశాడు.
ప్రస్తుతం తాను గర్భవతినని, పెళ్లి చేసుకోవాలని అడగ్గా నిరాకరించి, మొహం చాటేశాడని ఆరోపిస్తూ, నటి పోలీసులను ఆశ్రయించింది. అతని తల్లిదండ్రులకు కూడా విషయం చెప్పానని, వాళ్లు కూడా తనకు అండగా నిలవలేదని ఆరోపించింది. నటి ఫిర్యాదుపై కేసు రిజిస్టర్ చేసిన పోలీసులు, నిందితుడి కోసం గాలిస్తున్నట్టు తెలిపారు.