తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, రాష్ట్రంలోని బాలియా జిల్లాలోని కరణ్‌చప్రా గ్రామానికి చెందిన హథీ సింగ్(45) దశాబ్ద కాలంగా ప్రజా సేవలో నిమగ్నమైవున్నాడు. గత ఎన్నికల్లో పోటీ చేసినప్పటికీ ఆయనను విజయం వరించలేదు.
గ్రామం అభివృద్ధికి పాటు పడుతున్న అతను ఈ ఎన్నికల్లో పోటీ చేద్దామని భావించాడు. అయితే, ఆ స్థానం మహిళకు రిజర్వ్ చేశారు. దీంతో ఆయన మద్దతుదారులు, సహచరుల సూచన మేరకు పెళ్లి చేసుకున్నాడు. ఖచ్చితంగా హథీ సింగ్ భార్యనే గెలిపిస్తామని గ్రామస్తులు అంటున్నారు.