తల్లి మరణించింది. తాగుబోతు తండ్రిని మార్చాలనుకున్నాడు. రెండో పెళ్లి చేసుకున్నా.. తండ్రి తాగుడును వదిలిపెట్టలేదు. రోజూ తాగడం... ఎవరితోనైనా గొడవ పెట్టుకోవడం తండ్రి పనైపోయింది. తండ్రి బాగోతాన్ని ఐదేళ్ల పాటు భరించిన ఆ కుమారుడు.. ఇక లాభం లేదనుకున్నాడు. తండ్రి తన మరణంతోనైనా మారుతాడనుకున్నాడు. అంతే ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
వివరాల్లోకి వెళితే.. తమిళనాడులోని తిరునల్వేలి జిల్లా గురుకుల్‌పట్టి గ్రామానికి చెందిన మాడసామి, ఈశాకి అమ్మాళ్ కుమారుడు దినేశ్ నల్లశివన్ (17). ఇటీవలే 12వ తరగతి పూర్తి చేసిన దినేశ్ నీట్ పరీక్షకు సిద్ధమవుతున్నాడు. తొమ్మిదేళ్ల క్రితమే.. తల్లి మృతి చెందడంతో అప్పటి నుంచే అతనికి కష్టాలు మొదలయ్యాయి. తండ్రి తాగుడుకు బానిసయ్యాడు. రెండో పెళ్లి చేసుకున్నా అతడిలో ఎలాంటి మార్పు లేదు. అంతే దినేశ్ లేఖ రాశాడు.
''నాన్నా.. నా చావుతోనైనా నీలో మార్పు వస్తుందనుకుంటాను. ఇకనుంచైనా తాగుడు మానేయ్. కనీసం నా శవానికి తలకొరివి పెట్టేందుకైనా నువ్వు మద్యం తాగకుండా వస్తావనుకుంటున్నా. తలకొరివి కూడా తాగి పెట్టేపనైతే.. దయచేసి నా అంత్యక్రియలకు రాకు. అప్పుడే నా ఆత్మకు శాంతి లభిస్తుంది'' అంటూ దినేశ్ రాసిన లేఖ పలువురిని కంటతడి పెట్టించింది.