లైంగిక వేధింపులు భరించలేక... వ్యాపారిని కత్తితో పొడిచిన సోదరీమణులు... ఎక్కడ?

శుక్రవారం, 23 సెప్టెంబరు 2016 (08:57 IST)
లైంగిక వేధింపులు భరించలేక ఓ వ్యాపారిని ముగ్గురు సోదరీమణులు కత్తితో పొడిచారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని షామిలీ పట్టణంలో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే... 
 
షామిలీ పట్టణానికి చెందిన షమీమ్ అహ్మద్ అనే వడ్డీ వ్యాపారి ముగ్గురు యువతులున్న తండ్రికి ఇంటి నిర్మాణానికి లక్ష రూపాయలు అప్పుగా ఇచ్చాడు. అయితే ఈ అప్పు చెల్లించడంలో ఆ తండ్రికి చిక్కులు ఎదురయ్యాయి. దీంతో అప్పు తీసుకున్న పెద్దకూతురు (27)పై వడ్డీవ్యాపారి షమీమ్ అహ్మద్ కన్ను పడింది. తనకు పెద్దకుమార్తెతో గడిపేందుకు అవకాశం కల్పిస్తే ఇచ్చిన రుణాన్ని మాఫీ చేస్తానని అహ్మద్ ఒత్తిడి తెచ్చాడు. 
 
దీంతో ముగ్గురు సోదరిమణుల్లో ఒక అమ్మాయి అహ్మద్‌ను ఇంటికి రమ్మని ఆహ్వానించింది. అంతే అమ్మాయి కోసం ఇంటికి వచ్చిన వడ్డీవ్యాపారి అహ్మద్‌పై ముగ్గురు సోదరిమణులు మూడు కత్తులతో దాడి చేసి 20 పోట్లు పొడిచారు. అంతే అమ్మాయిని వేధించిన వడ్డీ వ్యాపారి అక్కడికక్కడే మరణించాడు. 
 
వడ్డీ వ్యాపారిని హత్య చేసిన ముగ్గురు సోదరీమణులను పోలీసులు అరెస్టు చేసి కోర్టులో ప్రవేశపెట్టారు. ఈ ముగ్గురు యువతులు హత్యకు ఉపయోగించిన మూడు కత్తులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ముగ్గురు యువతులు చేసిన పనులను స్థానిక మహిళా సంఘాలు అభినందిస్తున్నాయి. 

వెబ్దునియా పై చదవండి