అల్లుడు ఆర్టీఏలో ఇన్స్పెక్టర్గా పనిచేస్తుండడంతో ఆమె తల్లితండ్రులు కట్నం కింద 100 సవర్ల బంగారం, ఎకరానికి పైగా భూమి, కారును కట్నంగా అందించారు. కానీ పెళ్లైన కొద్ది రోజులకే విస్మయకు అత్తింట్లో వేధింపులు మొదలయ్యాయి. కారుకు బదులుగా డబ్బులు కావాలని భర్త, అత్తమామలు విస్మయను చిత్రహింసలు పెట్టేవారు. తనను తన భర్త, అత్తమామలు రోజూ చిత్రహింసలు పెడుతున్నారని తన తల్లికి చెప్పుకునేది విస్మయ.
ఆ తర్వాత కొద్ది రోజులకు తన కజిన్ కు తనను భర్త కొడుతున్నాడంటూ మెసేజ్ చేసింది. తనను జుట్టు పట్టుకుని ఈడ్చి ముఖంపై కొట్టాడని గాయాలను చూపిస్తూ ఫోటోలు పంపింది. తనను కిరణ్ కొట్టిన విషయాన్ని ఎవరికీ చెప్పవద్దని తాను కూడా ఎవరికీ చెప్పలేదని ఆ మెసేజ్‌ల్లో విస్మయ తెలిపిందని వెల్లడించారు. ఈ ఘటన జరిగిన రెండు రోజులకే విస్మయ ఆత్మహత్య చేసుకుంది.
అయితే విస్మయ ఆత్మహత్య చేసుకుందని అందరూ అనుకున్నారు. కానీ ఆ తర్వాత ఆమె తన అన్నకు పంపించిన మెసేజ్‌లు, ఫోటోలు బయటకు రావడంతో అసలు విషయం బయటపడింది. అందులో ఆమె మొహం, చేతులపై గాయాలున్నాయి. దీంతో తమ కూతురిని భర్త అత్తమామలే చిత్రహింసలు పెట్టి చంపేశారంటూ విస్మయ తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.