భారత రక్షణ శాఖకు చెందిన అత్యాధునిక ఎంఐ17వి5 విమానం బుధవారం తమిళనాడు రాష్ట్రంలోని నీలగిరి జిల్లా కాట్టేరి ప్రాంతంలో కుప్పకూలిపోయింది. ఈ ప్రమాదంలో భారత త్రివిధ దళాధిపతి బిపిన్ రావత్‌తో పాటు ఆయన భార్య మధులిక రావత్ మరో 11 మంది చనిపోయారు. అయితే, ఈ అత్యాధునిక హెలికాఫ్టర్ మంటల్లో కూలి బూడిదైపోయింది.
మరోవైపు, ఈ ప్రమాదంలో చనిపోయిన వారిలో బిపిన్ రావత్, మధులిక రావత్, బ్రిగేడర్ ఎల్ఎల్ లిద్దర్. లెఫ్టినెంట్ కర్నల్ హర్‌జిందర్ సింగ్, ఎస్కే గురుసేవక్ సింగ్, ఎన్కే జితేంద్ర కుమార్, వివేక్ కుమార్, బి.సాయితేజ, హవ్ సత్‌పాల్‌తో పాటు మరో ఐదుగురు ఉన్నారు. ఈ ఐదుగురు పేర్లు తెలియాల్సివుంది. పైగా, వీరంతా కున్నూరు సుల్లూరు ఎయిర్ బేస్‌కు చెందిన సిబ్బందిగా భావిస్తున్నారు.