అంతేకాకుండా అధికారంలోకి వస్తే యేడాదికి కోటి ఉద్యోగాలు ఇస్తానంటూ నమ్మించిన మోడీ.. గత నాలుగున్నరేళ్ళలో లక్ష ఉద్యోగాలు కూడా ఇవ్వలేక పోయారని ఆరోపించారు. ఫలితంగా నిరుద్యోగం బాగా పెరిగిపోయిందన్నారు. అలాగే దేశ వ్యాప్తంగా రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. అయినా బీజేపీకి చీమ కుట్టినట్టు కూడా లేదంటూ మండిపడ్డారు.
మోడీ పాలనలో మహిళలపై అత్యాచారాలు పెరిగిపోయాయని, చిన్నారి బాలికలకు కూడా రక్షణ లేకుండా పోయిందని సోనియా ఆరోపించారు. ఇందుకు పాల్పడిన వారు మాత్రం ఈ ప్రభుత్వ హయాంలో స్వేచ్ఛగా తిరుగుతున్నారని ఆరోపించారు. బీజేపీ పాలనకు వ్యతిరేకంగా దేశప్రజలంతా ఏకం కావాలని ఆమె పిలుపునిచ్చారు.