అక్రమ సంబంధం.. ప్రియుడితో ఉల్లాసంగా గడుపుతూ.. భర్తను చంపేసింది. అంతటితో ఆగకుండా ఏమీ తెలియనట్లుగా నాటకాలేసింది. అయితే పోలీసులు భర్తను హతమార్చిన భార్య గుట్టును రట్టు చేశారు. వివరాల్లోకి వెళితే, తిరువనంతపురంకు సమీపంలో పొత్తంకోట్టై ప్రాంతానికి చెందిన వినోద్ (35), రాగి (30) దంపతులకు ఇద్దరు సంతానం వున్నారు.
గత 12వ తేదీ వినోద్ కుటుంబంతో పాటు ఆలయానికి వెళ్లాడు. ఇంటికి తిరిగొచ్చాక వినోద్ స్పృహ తప్పి పడిపోయాడు. అయితే అతడు ఆత్మహత్యకు పాల్పడినట్లు రాగి నాటకమేసింది. కానీ శవపరీక్షలో వినోద్ గొంతు వద్ద కత్తిపోటు కారణంగా ప్రాణాలు కోల్పోయినట్లు తేలింది. వినోద్ తరపు బంధువులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు వినోద్ భార్య వద్ద పోలీసులు విచారణ జరిపారు.
ఈ విచారణలో వినోద్ బంధువు మనోజ్‌తో రాగికి అక్రమసంబంధం వుందని తెలిసింది. ఇంకా మనోజ్‌తో కలిసి వినోద్‌ను రాగి హతమార్చినట్లు తేలింది. ఈ కేసులో మనోజ్, రాగిలను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆపై కోర్టు ముందు హాజరు పరిచారు. ఈ కేసులో తండ్రి వినోద్‌ను తల్లి రాగిలు కలిసి చంపారని వినోద్ పిల్లలే సాక్షి చెప్పారు. దీంతో వినోద్, రాగిలకు చిప్పకూడు తప్పలేదు.