బీహార్‌లో టాప్ ర్యాంకర్లుగా నిలిచిన 10 మందిలో కొందరికి తగిన సామర్థ్యంలేదని, వారికి సబ్జెక్టులపై కనీస అవగాహన లేదంటూ మీడియాలో వచ్చిన కథనాలు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించాయి. ఈ క్రమంలో ప్రభుత్వం 15 మంది విద్యావేత్తలతో కమిటీ ఏర్పాటు చేసి.. పది మంది టాపర్లను మరోసారి పరీక్షించాలని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ఆదేశించారు.
ఈ నేపథ్యంలో సౌరభ్ శ్రేష్ఠ మాట్లాడుతూ.. మొదటి ర్యాంకర్‌గా నిలిచేందుకు తనకు సామర్థ్యం లేదని మీడియా బయటపెట్టడంతో తాను తీవ్ర మానసిక ఒత్తిడికి గురవుతున్నట్లు పేర్కొన్నాడు. సౌరభ్ శ్రేష్ఠను కమిటీ పిలిపించగా.. తనను ప్రశ్నలు అడిగితే ఆత్మహత్య చేసుకొంటానని బెదిరించాడు. దీంతో ఆందోళన చెందిన కమిటీ అతడిని బయటకు పంపి.. కొంత విరామం తర్వాత మళ్లీ పిలిపించింది. అయితే, కమిటీ అడిగిన ఒక్క ప్రశ్నకు కూడా అతడు సమాధానం చెప్పలేదని తెలిసింది.