సహోద్యోగులే అని నమ్మినందుకు యువతిపై సామూహిక అత్యాచారం

సోమవారం, 15 అక్టోబరు 2018 (14:16 IST)
మహిళలపై అత్యాచారాలు పెచ్చరిల్లిపోతున్నాయి. తాజాగా ఓ మహిళా ఉద్యోగినిపై సామూహిక అత్యాచారం చోటుచేసుకుంది. ఓ మహిళా ఉద్యోగినిని ఇంటివద్ద డ్రాప్ చేస్తానని నమ్మించిన ఇద్దరు వ్యక్తులు తమ ఫ్లాటుకు తీసుకెళ్లి బంధించి గ్యాంగ్ రేప్‌కు పాల్పడ్డారు.


ఆమెకు మత్తు మందు ఇచ్చి.. దుండగులు ఈ దారుణానికి పాల్పడ్డారు. చివరికి వీరి నుంచి తప్పించుకున్న యువతి పోలీసులను ఆశ్రయించింది. ఢిల్లీలో శనివారం రాత్రి జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. 
 
వివరాల్లోకి వెళితే.. ఢిల్లీలోని ద్వారక ప్రాంతంలో బాధితురాలు సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తోంది. ఈ నేపథ్యంలో ఆమె సహోద్యోగులు బిర్జూ(25), వినోద్ కుమార్(31)లు ఇంటి వద్ద డ్రాప్ చేస్తామని నమ్మబలికారు. దీంతో బాధితురాలు వారి కారులో ఎక్కింది. కారు ఎక్కిన ఆమెకు మత్తు మందు కలిపిన కూల్ డ్రింక్స్‌ ఇచ్చారు. 
 
అది తాగిన ఆ మహిళ కొద్దిసేపటికే స్పృహ కోల్పోవడంతో ఆమెను ఫ్లాటుకు తీసుకెళ్లి ఒకరి తర్వాత మరొకరు అత్యాచారం చేశారు. ఆదివారం ఉదయాన్నే స్పృహలోకి వచ్చిన బాధితురాలు, వారి నుంచి తప్పించుకుని ఇంటికి చేరింది. 
 
ఆపై తల్లిదండ్రుల సాయంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు. బాధితురాలికి వైద్య పరీక్షలు నిర్వహించగా, అత్యాచారం జరిగినట్లు తేలింది. పరారీలో వున్న నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు