ఇంటర్ ఫస్టియర్ ఫలితాల్లో మహబూబ్ నగర్ లాస్ట్

సోమవారం, 22 ఏప్రియల్ 2013 (10:25 IST)
File
FILE
ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం పరీక్షా ఫలితాలను రాష్ట్ర మంత్రి పార్థసారథి ఆదివారం విడుదల చేశారు. ఈ ఫలితాల్లో బాలికలు టాప్‌లో నిలిచారు. ఫస్టియర్‌లో 54.6 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. గత ఏడాదితో పోల్చితే ఒక శాతం మంది అదనంగా ఉత్తీర్ణులైనట్లు మంత్రి తెలిపారు.

ఈ ఫలితాల్లో బాలురు 50.22 శాతం, బాలికలు 59.46 శాతం మంది ఉత్తీర్ణులయ్యారు. ఫలితాలలో కృష్ణా జిల్లా 74శాతంతో మొదటి స్థానంలో ఉండగా, విశాఖ జిల్లా 66 శాతంతో ద్వితీయ స్థానంలో ఉన్నట్టు తెలిపారు. మహబూబ్నగర్ జిల్లా 40 శాతంతో చివరి స్థానంలో ఉందని తెలిపారు. మే 22 నుంచి సప్లిమెంటరీ పరిక్షలు నిర్వహిస్తారు. మే 3 లోగా దరఖాస్తు చేసుకోవాలని మంత్రి చెప్పారు.

వెబ్దునియా పై చదవండి