2010-11 బడ్జెట్‌లో వివిధ శాఖల కేటాయింపులు!

పార్లమెంట్‌లో శుక్రవారం 2010-11 వార్షిక బడ్జెట్‌ను కేంద్ర ఆర్థిక మంత్రి ప్రణబ్ ముఖర్జీ ప్రవేశపెట్టారు. గత యేడాదితో పోల్చితే ఈ యేడాది భారత్ ఆర్థిక పరిస్థితి మెరుగుపడినట్టు చెప్పుకొచ్చిన విత్తమంత్రి వివిధ శాఖలకు కేటాయించిన కేటాయంపులు ఇలా ఉన్నాయి.

* మౌలిక వసతుల అభివృద్ధికి రూ.173532 కోట్లు
* రైతుల పరపతి లక్ష్యం రూ.3.75 లక్షల కోట్లు
* భారత్ నిర్మాణానికి రూ.48000 కోట్లు
* రక్షణ రంగానికి రూ.147354 కోట్లు.
* ప్రాథమి విద్యకు రూ.31036 కోట్లు.
* ఆరోగ్య రంగానికి రూ.22300 కోట్లు
* గ్రామీణాభివృద్ధికి రూ.66100 కోట్లు
* నీటి సంరక్షణకు రూ.200 కోట్లు
* రైల్వేల అభివృద్ధికి రూ.950 కోట్లు
* విద్యుత్ రంగానికి రూ.5130 కోట్లు.

* తూర్పు భారతంలో రెండో హరిత విప్లవానికి రూ.2 వేల కోట్లు.
* రాష్ట్రీయ కృషి వికాస్ యోజనా పథకానికి రూ.300 కోట్లు
* జాతీయ రహదారుల అభివృద్ధికి రూ.19894 కోట్లు
* గ్రామీణ ఉపాధి హామీ పథకానికి రూ.40100 కోట్లు
* గోవా గోల్డెన్ జూబ్లీ ప్రాజెక్టుకు రూ.200 కోట్లు
* గంగానది ప్రక్షాళనకు రూ.500 కోట్లు
* మహిళా రైతుల నిధికి రూ.100 కోట్లు
* పట్ణణాభివృద్ధికి రూ.5400 కోట్లు

* సామాజికంగా వెనుకబడిన వర్గాల అభివృద్ధికి రూ.4000 కోట్లు.
* ప్రభుత్వ బ్యాంకులకు మూలధన సాయం రూ.16,500 కోట్లు
* ఇందిరా ఆవాస్ యోజనా పథకానికి రూ.10 వేల కోట్లు
* స్వయం సహాయక బృందాల నిధికి రూ.400 కోట్లు
* చిన్న, సూక్ష్మ తరహా పరిశ్రమలకు రూ.2400 కోట్లు
* బుందేల్‌ఖండ్‌ అభివృద్ధికి రూ.12000 కోట్లు
* ప్రభుత్వ రంగ బ్యాంకులకు రూ.16500 కోట్లు

* ఎస్‌జేఆర్‌వై పథకం కింద పట్టణాభివృద్ధికి రూ.5400 కోట్లు
* తిరుపతి అంతర్జాతీయ విమానాశ్రయానికి రూ.32 కోట్లు
* సంప్రదాయేతర ఇంధన వనరుల కోసం రూ.1000 కోట్లు
* అసంఘటిత కార్మికుల పింఛన్ల కోసం రూ.1000 కోట్లు
* సామాజిక న్యాయ మంత్రిత్వ శాఖకు రూ.12500 కోట్లు
* మెట్ట ప్రాంతాల్లో నీటి సరఫరా కోసం రూ.2400 కోట్లు
* మైనారిటీ వర్గాల సంక్షేమానికి రూ.2600 కోట్లు
* తిరుప్పూర్ టెక్స్‌టైల్ రంగానికి రూ.200 కోట్లు
* యూనిక్యూ పథకానికి రూ.1900 కోట్లు
* నీటి సంరక్షణకు రూ.200 కోట్లు

వెబ్దునియా పై చదవండి