స్టీల్ ధరలను పెంచిన స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా

ఆదివారం, 4 ఏప్రియల్ 2010 (11:12 IST)
దేశీయ ఇనుము ఉత్పత్తి కర్మాగారమైన స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (సెల్) సంస్థ స్టీల్ ధరలను పెంచినట్లు ప్రకటించింది.

ప్రతి టన్ను స్టీల్ ధరల్లో రూ. 2500లు పెచినట్లు సెల్ ఛైర్మెన్ ఎస్‌కే రూంగ్టా తెలిపారు. ముడి వస్తువుల ధరలు పెరగడంతో స్టీల్ ధరలను పెచాల్సివచ్చిందని ఆయన వెల్లడించారు. తమ సంస్థకు చెందిన స్టీల్ ఉత్పత్తుల ధరలను పెంచామని, ఇందులో రూ. 2,000ల నుంచి రూ. 2,500ల వరకు పెంచినట్లు ఆయన పేర్కొన్నారు.

పెరిగిన ధరలు తక్షణమే అమలులోకి వస్తాయని ఆయన తెలిపారు. ఇదిలావుండగా ప్రస్తుతం పెరిగిన స్టీల్ ధరలు తాత్కాలికమేనని కేంద్ర ఉక్కు శాఖామంత్రి వీరభద్ర సింగ్ వెల్లడించారు. కాగా సెల్ స్టీల్ ధరలను పెంచడంతో ఎస్సార్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్ సంస్థలు కూడా ధరలను పెంచాయి.

వెబ్దునియా పై చదవండి