అత్యధిక వేతనం పొందేవారి జాబితాలో ఇందిరా నూయీ

సోమవారం, 3 మే 2010 (10:38 IST)
FILE
అమెరికాకు చెందిన దాదాపు 500 పెద్ద కంపెనీల్లో అత్యధిక వేతనాలను పొందేవారి జాబితాలో పెప్సికో ప్రధాన కార్యనిర్వహణాధికారి ఇందిరా నూయీ చోటు దక్కించుకున్నారు.

సాంకేతిక రంగంలో అగ్రగామిగానున్న డేనాహర్ ప్రధాన కార్యనిర్వహణాధికారి హెచ్. లారెన్స్ కుల్ప్ అత్యధిక వేతనాలను పొందేవారి జాబితాలో ప్రథమ స్థానంలో నిలిచారు. ఈయన వేతనం 14.136 కోట్ల డాలర్లుగా ఉంది.

ఇదే జాబితాలో భారతదేశానికి చెందిన వారిలో ముగ్గురికి స్థానం దక్కడం విశేషం. వీరిలో నూయీకి 93వ స్థానం లభించింది. ఈమె తర్వాత క్వెస్ట్ డయాగ్నోస్టిక్ సంస్థకు చెందిన సూర్యా ఎన్. మోహాపాత్రాకు 96వ స్థానం లభించింది. అలాగే అడోబ్‌ సంస్థకు చెందిన శాంతను సూర్యనారాయణకు 425వ స్థానం లభించింది.

ఇదిలావుండగా పెప్సికో ప్రధాన కార్యనిర్వహణాధికారి నూయీకి 2009లో మొత్తం వేతనం 1.066 కోట్ల డాలర్లుగా ఉండింది. దీంతో ఆమెకు ప్రపంచంలో అత్యధిక వేతనం పొందే ఐదు వందలమంది ప్రముఖుల్లో 93వ స్థానం దక్కడం విశేషం.

వెబ్దునియా పై చదవండి