ఇటీవల కోల్ ఇండియా పబ్లిక్ ఇష్యూకు వచ్చిన స్పందన చూసి చాలా వరకూ ప్రభుత్వ రంగ సంస్థలు కూడా పబ్లిక్ ఇష్యూల బాట పట్టాయి. మార్కెట్ పబ్లిక్ ఇష్యూల క్యూలు కడుతున్నాయి.
ఇదే వరుసలో ఈనెల షిప్పింగ్ కార్పోరేషన్, ఎమ్ఓఐఎల్ సంస్థలు ఒకదాని తర్వాత మరొకటి పబ్లిక్ ఇష్యూకి రానున్నాయి. 3.3 కోట్ల షేర్లతో ఎమ్ఓఐఎల్ పబ్లిక్ ఇష్యూ నవంబర్ 26న ప్రారంభమై డిసెంబర్ 1న ముగియనుంది.
కాగా.. షిప్పింగ్ కార్పోరేషన్ పబ్లిక్ ఇష్యూ నవంబర్ 30న మొదలై డిసెంబర్ 3న ముగుస్తుంది. ఈ రెండు కంపెనీల అనంతరం హిందుస్తాన్ కాపర్, సెయిల్, ఓన్‌జీసీ, ఐఓసీ కంపెనీలు కూడా ఈ ఆర్థిక సంవత్సరంలో పబ్లిక్ ఇష్యూకి రావడనికి ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నాయి.