ఐదేళ్లలో రూ. 11,000 కోట్ల టర్నోవర్ లక్ష్యం: యుపిఎల్

ప్రస్తుతమున్న రూ. 5,400 కోట్ల టర్నోవర్‌ను వచ్చే ఐదేళ్ళలో రూ. 11, 000 కోట్లకు చేర్చే లక్ష్యాలతో అభివృద్ధి ప్రణాళికలను అమలు చేయనున్నట్టు యునైటెడ్‌ ఫాస్పరస్‌ లిమిటెడ్‌ (యుపిఎల్‌) ఇంటిగ్రేటెడ్‌ విభాగం హెడ్‌ భూపేన్‌ దూబే వ్యాఖ్యానించారు.

యుపిఎల్‌ అనుబంధ సంస్థ అడ్వాంటా ఇండియా ఆధ్వర్యంలో వచ్చే సంవత్సరం కాలంలో 12 రకాల హైబ్రిడ్‌ వెరైటీలను రైతులకు అందించనున్నామని, ముఖ్యంగా సంవత్సరంలో ఎప్పుడైనా వేసుకోగల టమోటా, బెండ తదితర రకాలను విడుదల చేస్తామని తెలిపారు.

తమ శాఖలను చైనా, బ్రెజిల్‌ తదితర దేశాలకూ విస్తరించే దిశగా ప్రయత్నాలు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. సాధారణ బీర విత్తనాలతో 10 టన్నుల దిగుబడి వస్తే అనితా బ్రాండ్‌తో 15 టన్నుల వరకూ దిగుబడి వచ్చిందని రైతులు తెలిపారు.

వెబ్దునియా పై చదవండి