అనుమతి వచ్చే వరకూ 3జీ వీడియో కాలింగ్ బంద్..!!

రక్షణ సంస్థల నుంచి అనమతి వచ్చేంతవరకు 3జీ సేవల ద్వారా అందిస్తున్న వీడియో కాలింగ్ సదుపాయాన్ని నిలిపివేయాలని మూడు ప్రముఖ టెలికాం సంస్థలకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు ఎయిర్‌టెల్‌, టాటా టెలీ సర్వీసెస్, రియలన్స్‌ సంస్థలకు ప్రభుత్వం ఒక లేఖ రాసింది.

3జీ సేవలను అమల్లోకి తేవడం ద్వారా త్వరలోనే వీడియో కాలింగ్ సేవలను అందించాలనుకుంటున్న కంపెనీలు ఆ సేవలను ప్రారంభించే ముందు తమకు సమచారం అందించాలని టెలికాం రంగం (డాట్‌) కోరింది. ఈ మూడు సంస్థలు ఇప్పటికే 3జీ సేవలను ప్రారంభించాయి. ఈ ఏడాది చివరినాటికి వీడియో కాల్‌ విధానాన్ని ప్రవేశపెట్టాలనే యోచనలో ఉన్నాయి.

వెబ్దునియా పై చదవండి