త్వరలోనే ఉల్లి ధరలు దిగొస్తాయి: ప్రణబ్ ముఖర్జీ

సోమవారం, 27 డిశెంబరు 2010 (10:03 IST)
దేశంలో ఉల్లిపాయల కొరత ఏర్పడటంతో ఒక్కసారిగా ఆకాశాన్నంటిన ఉల్లి ధరలు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయని, ప్రస్తుత పరిస్థితి త్వరలోనే నియంత్రణలోకి వస్తుందని కేంద్ర ఆర్థికమంత్రి ప్రణబ్‌ ముఖర్జీ ఆశాభావం వ్యక్తం చేశారు.

ఉల్లి ధరలను తగ్గించేందుకు ప్రభుత్వం అన్ని చర్యలూ తీసుకుంటుందని చెప్పారు. "ఉల్లి ఎగుమతులపై నిషేధం విధించాం. దిగుమతి సుంకాన్ని పూర్తిగా తొలగించాం. దిగుమతి చేసుకున్న ఉల్లిపాయలు మార్కెట్‌లకు చేరుకున్నాయి. ధరలు కూడా తగ్గుముఖం పడతాయ"ని ప్రణబ్ అన్నారు.

కొన్ని రకాల పండ్లు, కూరగాయలు, పాలు వంటి ఆహార ఉత్పత్తులు ఆయా సీజన్‌లను బట్టి ఉత్పత్తి అవుతాయని, మార్కెట్లో కొన్నిసార్లు డిమాండుకు తగ్గట్లుగా వీటిని సరఫరా చేయడంలో అంతరాయం ఏర్పడుతుందని, ఫలితంగానే ధరలు పెరిగుతున్నాయని ప్రణబ్ వివరించారు.

వెబ్దునియా పై చదవండి