22వ తేదీ నుంచి ముంబైలో ప్లాస్టివిజన్ ఇండియా 2011

దేశ వాణిజ్య రాజధాని ముంబైలో ఈనెల 22వ తేదీన ఎనిమిదో ప్లాస్టివిజన్ ఇండియా-2011 ప్రారంభంకానుంది. ఈ ఇంటర్నేషనల్ ప్లాస్టిక్ ఎగ్జిబిషన్ అండ్ కాన్ఫరెన్స్ మూడు రోజుల పాటు అంటే 24వ తేదీ వరకు జరుగుతుంది. ఇందులో 17 దేశాలకు చెందిన వెయ్యి మంది ఎగ్జిబిటర్లు పాల్గొననున్నారు. ఈ ప్రదర్శనంలో ప్లాస్టిక్ ముడిపదార్థాలు, ప్లాస్టిక్ ప్రాడక్ట్స్, ప్రత్యేకంగా డిజైన్ చేసిన వస్తువులు ఇందులో ప్రదర్శనకు ఉంచనున్నారు.

దీనిపై ఆల్ ఇండియా ప్లాస్టిక్ మ్యానుఫ్యాక్చరర్స్ అసోసియేషన్ ఛైర్మన్ కో చైర్మన్ హరీష్ ధర్మషీ మాట్లాడుతూ.. ప్లాస్టిక్ ఇండస్ట్రీలోనే అతిపెద్ద ప్రదర్శనగా ప్లాస్టివిషన్ ఇండియా 211ను నిర్వహించనున్నట్టు చెప్పారు. ముంబైలోని గుర్గాన్‌లో ఉన్న బాంబే ఎగ్జిబిషన్ సెంటర్‌లో నిర్వహించనున్నారు.

ప్రస్తుతం ప్లాస్టిక్ వాడకం నిత్యకృత్యమైందని, ఒక విధంగా చెప్పాలంటే ప్లాస్టిక్ యుగంలో జీవిస్తున్నామన్నారు. ప్లాస్టిక్ వాడకం లేని జీవితాన్ని గడపలేని పరిస్థితి నెలకొందన్నారు. ఈ ప్రదర్శనలో ప్లాస్టిక్ పరిశ్రమలో వచ్చిన అధునాతన టెక్నాలజీ వస్తు సామాగ్రి కొలువుదీరుతుందన్నారు.

ఇందులో తైవానా, హాంగ్‌కాంగ్, చైనా, కొరియా, యూరోప్, యూఏఈ, జపాన్, యూకే, యూఎస్ఏ, మలేషియా, సింగపూర్, స్విట్జర్లాండ్, హాలాండ్ దేశాలకు చెందిన కంపెనీలు ఇందులో పాల్గొని తమ వస్తువులను ఉత్పత్తి చేస్తున్నాయన్నారు.

వెబ్దునియా పై చదవండి