రిలయన్స్ ఇన్‌ఫ్రా, రిలయన్స్ నేచురల్ రిసోర్సెస్, ఈ కంపెనీలకు చెందిన నలుగురు డైరక్టర్లు స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడులు పెట్టకుండా స్టాక్ ఎక్చేంజ్ బోర్డు నిషేధం విధించినట్టు వస్తున్న వార్తలను అనిల్ అంబానీ గ్రూపు తోసిపుచ్చింది.
విదేశీ పెట్టుబడులను నిబంధనలకు విరుద్ధంగా స్టాక్ మార్కెట్‌లో పెట్టి ఈ రెండు కంపెనీలు అక్రమాలకు పాల్పడినట్టు ఆరోపణలు వచ్చాయి. దీంతో ఈ రెండు సంస్థలతో పాటు.. డైరక్టర్లపై 2012 వరకు నిషేధం విధించినట్టు శుక్రవారం మీడియాలో వార్తలు వచ్చాయి.
దీనిపై అనిల్ అంబానీ గ్రూపులు శనివారం ఒక ప్రకటన విడుదల చేశాయి. సెబీ రెగ్యులేటర్ తమపైనా తమ సంస్థల డైరక్టర్లపైనా ఎలాంటి నిషేధం విధించలేదని రిలయన్స్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అధికార ప్రతినిధి విడుదల చేసిన పత్రికా ప్రకటనలో పేర్కొంది.