రిజర్వు బ్యాంకు డిప్యూటీ గవర్నర్‌గా ఆనంద్ సిన్హా

భారతీయ రిజర్వు బ్యాంకు డిప్యూటీ గవర్నర్‌గా ఆనంద్ సిన్హా నియమితులయ్యారు. ఆయన నియామకానికి కేంద్రం ఆమోదం తెలిపింది. గత యేడాది నవంబరులో పదవీ విరమణ చేసిన డిప్యూటీ గవర్నర్ ఉషా తోరట్ స్థానంలో ఆనంద్ సిన్హాను నియమించారు.

ప్రస్తుతం ఆర్బీఐలో ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టరుగా పనిచేస్తున్న సిన్హాను డిప్యూటీ గవర్నర్‌గా నియమంచడానికి ప్రభుత్వం ఆమోదం తెలిపిందని ఆర్థిక మంత్రిత్వ శాఖకు చెందిన సీనియర్‌ అధికారి వెల్లడించారు. ఆర్బీఐలో బ్యాంకింగ్‌ కార్యకలాపాలు, అభివృద్ధి, ఫైనాన్షియల్‌ స్టెబిలిటీ యూనిట్లను సిన్హా పర్యవేక్షిస్తున్నారు.

ఫిబ్రవరిలో 60 యేళ్లకు వయస్సుకు చేరుకునే సిన్హా మరో రెండు సంవత్సరాల పాటు ఆ పదవిలో కొనసాగుతారు. సాధారణంగా ఆర్బీఐలో డిప్యూటీ గవర్నర్లకు 62 ఏళ్ళ వయసు వరకూ సేవలందించే వెసులుబాటు ఉంది.

వెబ్దునియా పై చదవండి