నోకియా పని ఖేల్‌ఖతం!

సోమవారం, 21 ఏప్రియల్ 2014 (16:38 IST)
FILE
నోకియా ప్రతీఒక్కరికీ పరిచయమైన పేరు. కానీ ఇక ఈ మొబైల్ కంపెనీ పేరు మరుగున పడిపోనుంది. అది కాస్త
మైక్రోసాఫ్ట్ మొబైల్‌‌గా మారనుంది. అవును, నోకియా మొబైల్ కంపెనీ ఇక కాలగర్భంలో కలిసిపోనుంది. ఈనెల ఏప్రిల్ చివరి వరకు నోకియా కంపెనీ కాస్త మైక్రోసాఫ్ట్ సాఫ్ట్‌వేర్ కంపెనీగా మారనుంది. ఈమేరకు ఇరు కంపెనీల మధ్య కుదిరిన ఒప్పందం స్పష్టం చేస్తోంది.

ఎంతో చరిత్ర కలిగిన నోకియా మొబైల్ అంతర్థానం అయ్యే రోజు దగ్గర్లోనే ఉంది. ఫిన్లాండ్‌కు చెందిన నోకియా కార్పొరేషన్ మొబైల్ వ్యాపారాన్ని మైక్రోసాఫ్ట్ కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. ఈ డీల్ ఏప్రిల్ లోపు పూర్తి కానున్నట్లు నోకియా స్వదేశంలోని తన డీలర్లకు సమాచారం అందించింది. అంతేకాదు, ఈ డీల్ పూర్తయితే నోకియా కార్పొరేషన్ పేరు మైక్రోసాఫ్ట్ మొబైల్ గా మారనున్నట్లు తెలియజేసింది. దీన్నిబట్టి చూస్తే సమీప భవిష్యత్తులోనే నోకియా కాస్తా మైక్రోసాఫ్ట్ మొబైల్ గా దర్శనమివ్వనుందని అర్థమవుతోంది.

వెబ్దునియా పై చదవండి