ఉద్యోగ సంఘాలు ఆందోళను విరమించుకోవాలి: ధర్మాన

తమ డిమాండ్ల సాధన కోసం ఉద్యోగ సంఘాలు చేపట్టిన ఆందోళలు తక్షణం విరమించుకోవాలని రాష్ట్ర రెవెన్యూ శాఖామంత్రి ధర్మాన ప్రసాదరావు మరోమారు విజ్ఞప్తి చేశారు. దీనిపై ఆయన మంగళవారం సచివాలయంలో విలేకరులతో మాట్లాడుతూ ప్రభుత్వ ఎన్జీవో సంఘాలు చేపట్టిన ఛలో హైదరాబాద్‌ను ప్రభుత్వం ఎట్టిపరిస్థితుల్లోనూ అడ్డుకోబోదన్నారు.

ఉద్యోగుల డిమాండ్లపై ప్రభుత్వం స్పందించటం లేదన్న వార్తలను ఆయన కొట్టిపారేశారు. ఉద్యోగులతో చర్చలకు తాము సిద్ధమని ఆయన తెలిపారు. అందువల్ల ఉద్యోగులు తక్షణం తమ ఆందోళనను విరమించుకోవాలని ఆయన కోరారు.

ప్రధానంగా పౌర జీవనానికి ఎలాంటి ఆటంకాలు కలుగకుండా ప్రజాస్వామ్యయుతంగా వారు ఆందోళన చేసుకోవచ్చన్నారు. సమస్యల పరిష్కారం కోసం మంత్రివర్గ ఉపసంఘం అనేకదఫాలుగా సమావేశమై చర్చిందన్నారు. ప్రజలకు ఇబ్బంది కలిగేలా ఉద్యోగులు ఆందోళన చేస్తూ పోలీసులు అడ్డుకుంటారని ధర్మాన అన్నారు.

వెబ్దునియా పై చదవండి